నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. నటుడిగా ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబా ద్‌లో జరగనున్న ‘ఎన్‌బీకే50’ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు విలేకరులకు వెల్లడించారు. ‘తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి బాలకష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి.
ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు’ అని వివరించారు. ప్రెస్‌మీట్‌లో కేఎల్‌ఎన్ కల్యాణ్, అనుపమ్‌రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.