calender_icon.png 28 October, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు స్కూళ్లకు వర్కింగ్ డేనే!

14-09-2024 12:31:21 AM

కొన్ని జిల్లాల్లో హాలిడే.. కొన్ని జిల్లాల్లో వర్కింగ్ డే!

హైదరాబాద్, సెస్టెంబర్ 13 (విజయక్రాంతి): నేడు కొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు లేదు. భారీ వర్షాల కారణంగా ఈ నెల 2, 3 తేదీల్లో జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవులిచ్చారు. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు రోజులిస్తే, మరికొన్ని జిల్లాల్లో మూడు, నాలుగు రోజుల వరకు బడులకు సెలవులను ప్రకటించారు. అయితే విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈనెల 2కు బదులుగా నేడు (రెండో శనివారం) పాఠశాలలు తెరవాలని జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరికొన్ని జిల్లాల్లో ఈనెల 2కు బదులుగా నవంబర్ 9న (రెండో శనివారం), 3వ తేదీకి బదు లుగా డిసెంబర్ నెలలోని రెండో శనివారం (డిసెంబర్ 14న) పాఠశాలలకు పనిదినంగా నిర్ణయించారు. భారీ వర్షాల కారణంగా సెలవులివ్వడంతో రెండో శనివారాల్లో స్కూళ్లను తెరవాలని, బడులకు వర్కింగ్ డేగా పరిగ ణించాలని  వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు వర్కింగ్ డేగా, మరికొన్ని జిల్లాలు హాలిడేగా ప్రకటించాయి.