calender_icon.png 25 October, 2024 | 2:49 AM

నేడు సింగరేణిలో పండుగ బోనస్

25-10-2024 12:41:09 AM

  1. ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ
  2. గతేడాది కంటే రూ.50 కోట్లు అధికం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): ఇటీవల సింగరేణి ఉద్యోగులందరికీ లాభాల వాటా కింద రూ.796 కోట్లను పంపిణీ చేసిన యాజమాన్యం.. శుక్రవారం మరో రూ.358 కోట్లను దీపావళి బోనస్ కిం ద చెల్లించనుంది. సింగరేణి యాజమాన్యం ఏటా ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్(పీఎల్‌ఆర్‌ఎస్)పేరుతో దీపావళి బోనస్‌ను పంపిణీ చేస్తుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గురువారం సచివాలయంలో ప్రకటించారు. గతేడాది చెల్లించిన బోనస్ కంటే ఈసారి రూ.50 కోట్లు అధికంగా చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దీంతో దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుడు రూ.93,750 అందుకోనున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మధ్యాహ్నం కల్లా కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఆదేశించారు. బోనస్ ద్వారా దాదాపు 40,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు.

మొత్తం రూ.1,250 కోట్ల చెల్లింపులు

దసరాకు ముందు కార్మికులకు లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపి ణీ చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ. 1.90 లక్షలు అందాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించారు. ఇప్పుడు మరో రూ.358 కోట్లను యాజమా న్యం బోనస్‌గా అందించనుంది.

ఈ బోనస్ అందితే నెల రోజుల వ్యవధిలోనే కార్మికులకు సింగరేణి యాజమాన్యం రూ.1,250 కోట్లను చెల్లించినట్లు అవుతుంది. బోనస్ చెల్లింపులు సకాలంలో జరిగే చూడాలని పర్సనల్, ఫైనాన్స్ విభాగం అధికారులను సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు.