calender_icon.png 12 October, 2024 | 4:45 PM

నేడు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు

12-10-2024 02:16:33 AM

గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో

ఏర్పాటుకు జీవో జారీ 

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) :  తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలుచేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైనదైన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు వేయాలని నిర్ణయించారు.

దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్ వార్డుస్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్‌పర్సన్‌గా ఉండగా, మున్సిపాలిటీ స్థాయిల్లో  కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు.

ఇక ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో ఎస్‌హెచ్‌బీ సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉండనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు బీసీతోపాటు ఎస్సీ లేదా ఎస్టీలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. ఈ కమిటీలను శనివా రం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి.

కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశించి ంది. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు అవగాహన కల్పించడంతో పాటు అనుమానాలు నివృత్తి చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షలను నిర్మిం చాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసి ందే.