21-04-2025 01:41:35 AM
సాయంత్రం మోదీతో చర్చలు, అనంతరం విందు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన ఖరా రైంది. సోమవారం ఆయన కుటుంబంతో కలిసి భారత్‌లోని పాలం (ఢిల్లీ) ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్నారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భారత్‌లోని పలు చారిత్రాత్మక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో చర్చలు జరపనున్నారు.
అనంతరం ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబానికి విందు ఇవ్వనున్నారు. వాన్స్ దంపతులు ఏప్రిల్ 23న తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.