calender_icon.png 12 January, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

07-10-2024 12:00:00 AM

పాలస్తీనా తీవ్రవాదుల దుశ్చర్య

అక్టోబర్ 7, 1985: 440 మందితో వెళ్తున్న ఇటాలియన్ ప్యాసింజన్ నౌక అకిల్లె లారోను పాలస్తీనా తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. 50 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయకపోతే దానిని పేల్చివేస్తామని ఇజ్రాయిల్ దేశాన్ని బెదిరించారు. ఈ ఘటనలో వృద్ధ అమెరికన్ క్లింగ్ హోఫర్ హత్యకు గురయ్యాడు. 

రుమేనియా ఆక్రమణ

1940, అక్టోబర్ 7: ఐరోపాలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దళాలు వ్యూహత్మక చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకోవడానికి రుమేనియాను ఆక్రమించాయి. 

బెంగాల్ వరద

అక్టోబర్ 7: 1737లో దాదాపు నలభై అడుగుల ఎత్తున సముద్ర కెరటాలు బెంగాల్‌ను ముంచెత్తాయి. ఈ ఘటనలో దాదాపు 3 లక్షల మంది మరణించారు.