calender_icon.png 28 October, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

28-10-2024 12:00:00 AM

హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రారంభం

1636, అక్టోబర్ 28: 1636లో స్థాపించబడిన హార్వర్డ్ యూనివర్శిటీ యూఎస్‌లో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యా సంస్థ. ఈ యూనివర్సిటీలో చదివిన ఎంతోమంది గొప్ప విద్యావంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఇది కేంబ్రిడ్జ్‌లో స్థాపించబడింది. ఆస్తిలో తన సగభాగాన్ని విరాళంగా ఇచ్చిన జాన్ హార్వర్డ్ అనే పేరు మీద ఈ యూనివర్సిటీ ఏర్పడింది. విశిష్ట పూర్వ విద్యార్థుల్లో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థోరో, హెన్రీ జేమ్స్ లాంటివారున్నారు. 

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిష్ట

1886, అక్టోబర్ 28: న్యూయార్క్ హార్బర్‌లోని బెడ్లో ద్వీపంలో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ని ప్రతిష్ఠించారు. అమెరికన్ విప్లవ యుద్ధం సమయంలో ఫ్రెం-అమెరికన్ కూటమిని స్మరించుకుంటూ ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చిన  విగ్రహం ఇది. స్టాచ్యూ నిర్మాణం 300 అడుగుల (92.9 మీటర్లు) ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించిన స్త్రీ మూర్తిలా రోమన్ దేవతను సూచిస్తుంది.

చెకోస్లోవేకియా రిపబ్లిక్

1918, అక్టోబర్ 28:- మాజీ ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న బొహెమియా, మొరావియా, స్లొవేకియా అనే మూడు ప్రావిన్సుల నుంచి విలీనం చేయబడిన తర్వాత చెకోస్లోవేకియా రిపబ్లిక్ స్థాపించబడింది.