calender_icon.png 30 September, 2024 | 2:52 PM

చరిత్రలో ఈ రోజు

30-09-2024 12:00:00 AM

గోల్కొండ రాజ్యం విలీనం

ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658-1707 వరకు రాజ్యం చేశాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. ఔరంగజేబు గొప్పదైవ భక్తుడు. మతాచారాలను తు.చ.తప్పకుండా పాటించేవాడు. అయితే ఈయన హయంలో 1667 సంవత్సరం సెప్టెంబర్ 30న గోల్కొండ రాజ్యం ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.   

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి

మౌలానా రూమ్, మౌలానా రూమి, రూమి అనే పేర్లతో ప్రసిద్ధి. ఈయన 1207వ సంవత్సరం సెప్టెంబర్ 30న జన్మించారు. 13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి. రూమి బల్ఖ్ ప్రాంతంలోని ఖొరాసాన్‌లో జన్మించాడు. రూమి తండ్రి ‘బహావుద్దీన్ వలద్’ ఒక ధార్మిక పండితుడు, న్యాయవేత్త, బల్ఖ్‌కు చెందిన ఒక సూఫీ. ఇతనికి సుల్తానుల్ ఉలమా అనే బిరుదు ఉండేది. రూమి 17 డిసెంబరు 1273లో కోన్యాలో మరణించారు.

అతని పార్థివ శరీరాన్ని, అతని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ స్థలంపై ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. దానిపేరు యెసిల్ తుర్బె. అంటే పచ్చని గుమ్మటం అని అర్థం. ఇది ప్రస్తుతం మెవ్లానా పురవస్తు ప్రదర్శన శాలగా ఉన్నది. అతని సమాధిపై ‘మనం మరణించిన తరువాత మన సమాధిని భూమిలో కాక జనుల గుండెలలో చూసుకోవాలి’ అని రాయబడి ఉంటుంది. 

మ్యూనిచ్ ఒప్పందం

జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లిక్, ఇటలీ సామ్రాజ్యాల మధ్య 1938 సెప్టెంబర్ 30న మ్యూనిచ్ నగరంలో జరిగిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందాన్ని మ్యూనిచ్ ఒప్పందం అంటారు. దీని ప్రకారం చెకోస్లోవేకియాలోని సుడేటన్ భూభాగం జర్మనీలో కలపబడింది. ఫ్రాన్స్, చెకోస్లోవాక్ రిపబ్లిక్‌ల మధ్య జరిగిన ఒప్పందం. మ్యూనిచ్ ఒప్పందం జరగడంతో ఐరోపాలో చాలామంది సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే ఈ ఒప్పందం ఒక పెద్ద యుద్ధాన్ని ఆపివేసిందని ప్రజలు భావించారు.

యూఎన్‌లో సభ్యత్వం

1947 సెప్టెంబర్ 30న పాకిస్థాన్ ఇంకా యెమన్ దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్నాయి.