27-04-2025 12:00:00 AM
నేషనల్ టెల్ ఎ స్టోరీ డే..
యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న నేషనల్ టెల్ ఎ స్టోరీ డేను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో అన్ని వయసుల వారు కథలను పంచుకోవచ్చు. కథలు అనేక రూపాల్లో కూడా ఉండవచ్చు. కథలు ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానాన్ని అందిస్తుంది. కథ అదే ఆచారాలను, చరిత్రను, కుటుంబ సంప్రదాయాలను, వినోదాన్ని, విద్యాను తెలుపుతుందని వారి నమ్మకం.
ఒలింపిక్ క్రీడలు
1908 ఏప్రిల్ 27న లండన్‌లో నాలుగవ ఒలిపింక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. నిజానికి ఈ క్రీడలు రోమ్‌లో జరగాలని అనుకున్నప్పటికీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ప్రతిపాదన మేరకు లండన్‌లో నిర్వహించారు.
వరల్డ్ స్టేషనరీ డే
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న వరల్డ్ స్టేషనరీ డే జరుపుకుంటారు. కంప్యూటర్లను ఉపయోగించడం కంటే స్టేషనరీ, కాగితంపై రాయడం వంటిది ఈ రోజు ప్రాముఖ్యత. ఈరోజు చరిత్రను చూసినట్లయితే.. ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం పడిన రోజు.
ఆ మహా చారిత్రకు నేటికి 800 ఏళ్లు. మాగ్నా కార్టా అంటే ఇది అధికారులపై తిరుగుబాటుకు తొలిసారి అడ్డుకట్ట వేసిన పత్రం. ఇది వ్యక్తి స్వేచెే్ఛహక్కుల పత్రం. రాజు చట్టానికి అతీతుడు కాదని, చట్టపాలనకు లోబడాల్సిందేనంటూ రూపొందించిన తొలి హక్కు పత్రంపై బ్రిటిన్ రాజు జాన్ సంతకం పెట్టిన క్షణం.