calender_icon.png 15 April, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

13-04-2025 12:09:35 AM

జలియన్ వాలాబాగ్ ఊచకోత..

1919 ఏప్రిల్  13న పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 379 మంది మరణించారు. 1,200 మంది గాయపడ్డారు. 

అపోలో మిషన్

1970లో జరిగిన అపోలో-13 మిషన్. ఇది చంద్రుని దగ్గరకు వెళ్తున్న సమయంలో ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోవడంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. అందుకే దీన్ని విజయవంతమైన వైఫల్యంగా నాసా పేర్కొంది. 

అమెరికాలో అడుగుపెట్టిన ఏనుగు

1796 ఏప్రిల్ 13న మన దేశం నుంచి పంపించిన ఏనుగు అమెరికాను చేరింది. అంతవరకు అమెరికన్లు ఏనుగును చూడలేదు. ఏనుగును చూడటం అదే మొదటిసారి.