calender_icon.png 18 April, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

06-04-2025 12:00:00 AM

ప్రపంచ ఇడ్లీ డే

ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. అయితే ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా ఇడ్లీని సాంబార్, పచ్చడితో తింటుంటారు. ఇడ్లీ దినోత్సవం ప్రతి ఏటా మార్చి 30న అంటే ఈ రోజు ప్రపంచ ఇడ్లీ డే గా జరుపుకుంటారు. కాని సగటు దక్షిణాది కుటుంబాలకు మాత్రం ప్రతిరోజూ ఇడ్లీ దినోత్సవమే. ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 

అలాస్కా.. అమెరికా! 

అలాస్కా ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయవ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగం పరంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకన్నా చాలా పెద్దది. 1867, మార్చి 30న అలాస్కా భూభాగాన్ని రష్యా నుంచి ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసుకున్నది అమెరికా. అప్పటి నుంచి అలాస్కా భూభాగంపై అమెరికాకు అధికారం వచ్చింది.