23-03-2025 12:00:00 AM
అమరవీరుల దినోత్సవం
1931, మార్చి 23: భారత స్వాతంత్య ఉద్యమ సమయంలో భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ జైల్లో ఉరితీసింది. ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
గాల్లో విమానం
1903, మార్చి 23: రైట్ బ్రదర్స్.. ఓర్విల్లే, విల్బర్ అనే ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు. ప్రపంచంలోని మొట్టమొదటి విమాన సృష్టికర్తలు. 1903లో అమెరికన్ గవర్నమెంట్ నుంచి విమానాన్ని గాల్లోకి ఎగిరివేయడానికి పూర్తి హక్కును పొంది.. డిసెంబరు 17న విజయవంతంగా గాల్లోకి ఎగిరేశారు.