calender_icon.png 16 March, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

16-03-2025 12:00:00 AM

జాతీయ టీకా దినోత్సవం

1955, మార్చి 16: వ్యాక్సిన్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన నేషనల్ వ్యాక్సినేషన్ డే నిర్వహిస్తున్నారు. దీనినే ‘జాతీయ టీకా దినోత్సవం’ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఈరోజున టీకా డ్రైవ్‌లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1995లో మార్చి 16వ తేదీన జోనాస్ సాల్క్ పోలియో కోసం మొట్టమొదటి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇండియాలో మొదటిసారి నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఇచ్చారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

సచిన్ అరుదైన రికార్డ్

2012, మార్చి 16: సచిన్ టెండూల్కర్ గొప్ప ఇండియన్ క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా. 2012, మార్చి 16న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 100వ సెంచరీ అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఆసియా కప్ 2012 టోర్నీలో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 114 పరుగులు చేశాడు.