09-02-2025 12:00:00 AM
దూసుకెళ్లిన బోయింగ్
1969, ఫిబ్రవరి 9: ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏదంటే బోయింగ్--747. ఇంద్ర భవనంలా ఉండే ఈ విమానాన్ని జంబో జెట్ అంటారు. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉం టుంది. ఇది సుమారు 9,000 మైళ్ల వరకు ప్రయాణించగలదు. దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు. బోయింగ్--747 విమానాన్ని ఫిబ్రవరి9న మొదటిసారి పరీక్షించారు.
భారత్ తొలి జనాభా గణన
1951, ఫిబ్రవరి 9: జనాభాలో సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి, నమోదు చేసే ప్రక్రియను జనాభా గణన అంటారు. అయితే స్వాతంత్య్రం తర్వాత 1951లో మొదటిసారి జనాభా గణన జరిగింది.
-బెనిన్ అంతం
1897, ఫిబ్రవరి 9: 1897లో బ్రిటిష్ సాహసయాత్ర దళం బెనిన్ నగరాన్ని ఆక్రమించింది. నైజీరియా రాజ్యమైన బెనిన్‌ను అంతం చేసింది.