1870 ఫిబ్రవరి 3: యునైటెడ్ స్టేట్స్ అమెరికా రాజ్యాంగానికి పదిహేనవ సవరణ చేసి, జాతితో సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కుకు కల్పించింది. అప్పటి వరకూ నల్ల జాతీయులకు ఓటు హక్కు ఉండేది కాదు.
1962 ఫిబ్రవరి 3: అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ క్యూబాతో ఆహారం, మందులు మినహా అన్ని రకాల వాణిజ్య రవాణాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిషేధం నేటికీ అమలతున్నది.
1995 ఫిబ్రవరి 3: న్యూయార్క్‌కు చెందిన ఎలీన్ కాలిన్స్ అనే మహిళా స్పేస్ షటిల్‌ను నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది.
మోట బొక్కెన
ఈ తరం వారికి ఈ పేరు వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ.. మన తాతల కాలంలో వ్యవసాయం చేయడానికి, బావుల్లో నీటిని తోడడానికి మోట బొక్కెనను ఉపయోగించేవారు. దున్నపోతుల సహాయంతో మోట బొక్కెన ద్వారా బావిలోని నీటిని తోడేవారు.
పాతకాలం నాటి పీట
గృహప్రవేశానికి, పెళ్లిళ్లకు.. పూజలకు.. ఇలా సందర్భం ఏదైన సరే.. టక్కున గుర్తుకు వచ్చేది పీట. ఇది తాతల కాలం నుంచి బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఏదో ఒక మూలన పాతకాలం నాటి చెక్క పీటలు కనిపిస్తుంటాయి. ఇప్పటికీ చెక్కపీటల శోభ ఏ మాత్రం తగ్గలేదు.