హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల పంపిణీ
1988 జనవరి 27: అండమాన్, నికోబార్ దీవుల్లో ఉత్తరాలు పంపిణీ చేసేందుకుగాను మొట్టమొదటిసారిగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఫోర్ట్‌బ్లెయిర్ నుంచి హావ్లాక్ ద్వీపానికి తొలి విమానాన్ని అండమాన్ నికోబార్ దీవుల గవర్నర్ ప్రారంభించారు.
నాజీ నిర్బంధ శిబిరాలకు విముక్తి
1945 జనవరి 27: రెండో ప్రపంచ యుద్ధంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే యుద్ధం వల్ల కొన్ని దేశాలకు తీవ్ర నష్టం జరిగితే.. మరికొన్ని ప్రాంతాలు నిర్బంధం నుంచి బయటపడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌లోని ఆష్విట్జ్, బిర్కెనౌల అనే నాజీ నిర్బంధ శిబిరాలు విముక్తి పొందాయి.