క్లింటన్ అనే నేను..
1993, జనవరి 20: విలియం జెఫెర్సన్ క్లింటన్ జనవరి 20, 1993 నుంచి జనవరి 20, 2001 వరకు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. గతంలో అర్కాన్సాస్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. బుష్ తర్వాత అధికారంలోకి వచ్చాడు. క్లింటన్ అధ్యక్ష పదవి అమెరికా రాజకీయాలను పూర్తిగా మార్చేసింది.
మొబైల్ పోర్టబులిటీ ప్రారంభం
2011, జనవరి 20: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీస్‌ను ప్రారంభించారు. మొబైల్ పోర్టబులిటీ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందాయి. ఇప్పటికీ మొబైల్ పోర్టబులిటీ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక టెలికాం రంగ నెట్‌వర్క్ నుంచి మరొక టెలికాం రంగ నెట్‌వర్క్‌కు అదే నెంబర్‌ను మార్చుకోవడానికి మొబైల్ పోర్టబులిటీని ఉపయోగిస్తారు.
నైజీరియా మతఘర్షణలు
2010 జనవరి 20: నైజీరియాలో తీవ్రస్థాయిలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏకంగా 200 మంది వరకు మృతి చెందారు.