గాంధీజీ చివరి నిరాహారదీక్ష
1948 జనవరి 13: స్వాతంత్య్రం ప్రారంభమైన వేళ ఉపఖండంలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది. దాంతో మహాత్మ గాంధీ శాంతి సమావేశాలను నిర్వహించడానికి అల్లర్లు చెలరేగిన ప్రాంతాలకు వెళ్లారు. గాంధీ హింసను అణచివేయగలిగినప్పటికీ, తాత్కాలికంగా మాత్రమే తగ్గింది. కానీ ద్వేషాన్ని పెంచుకునే మనసులు మారలేదని భావించాడు. అందుకే 1948 జనవరి 13న గాంధీ నిరాహార దీక్షకు దిగాడు. ఇదే గాంధీజీ చివరి నిరాహారదీక్షగా చరిత్రలో మిగిలిపోయింది.
ఇటలీ క్రూయిజ్ నౌక మునక
2012 జనవరి 13: ఇటలీలోని గిగ్లియో ద్వీ పంలో సుమారు 4,200 మందితో వెళ్తున్న కోస్టా కాంకార్డియా అనే క్రూ యిజ్ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 32 మంది ప్రయాణికు లు చనిపోయారు.
అంతరిక్షంలోకి మొదటి భారతీయుడు
1949 జనవరి 13: అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1949 జనవరి 13న సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138వ వాడు.