మదర్ థెరీసా సేవాతత్పరత
1929, జనవరి 6: మదర్ థెరీసా పరిచయం అవసరం లేని పేరు. పరదేశం నుంచి ఇండియాకు వచ్చిన ఆ ప్రేమమూర్తి. మనదేశంలో ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుంది. కోల్‌కత్తా మురికివాడల్లోని పేదల సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. నోబెల్ గ్రహీత అయిన థెరీసా మానవత్వం, దయాగుణం, శాంతి, సహాయాని కి మారుపేరు. 1929లో మదర్ థెరీసా తెరెసా ఇదే రోజున భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది.
వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై దాడి
2021, జనవరి 6: 2021లో జో బైడెన్, కమలా హారిస్ ఎన్నికల విజయాలను నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంపై దాడి చేశారు.
విప్లవాత్మక విద్యకు పునాది
1907 జనవరి 6: రోమ్‌లోని సపియంజా విశ్వవిద్యా లయంలో వైద్య పాఠశాలను ప్రారంభించింది. ఇటలీలో వైద్య పాఠశాలకు హాజరైన మొదటి మహిళల్లో ఒకరు. 1907 మరియా మాంటిస్సోరి తన మొదటి పాఠశాలను ప్రారంభించింది. మాంటిస్సోరి విప్లవాత్మక విద్యా విధానం నేడు అనేక పాఠశాలల్లో ఆచరణలో ఉంది.