సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష
2006, డిసెంబర్ 30: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు 2006, డిసెంబర్ 30న ఉరిశిక్ష పడింది. 1982లో తన వ్యతిరేకులను 148 మంది దుజాయిల్ నగరంలో చంపారనే ఆరోపణలతో సద్దాం హుస్సేన్‌కు ఇరాక్ కోర్టు 2006 నవంబర్‌లో మరణ శిక్ష విధించడం జరిగింది. ఇరాక్‌కు సుమారు రెండు దశాబ్దాల పాటు పాలించిన తరువాత 2003లో ఆయన పాలన ముగిసింది.
ఆలిండియా ముస్లిం లీగ్
1906, డిసెంబర్ 30: 1906లో బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఆలిండియా ముస్లిం లీగ్‌ను స్థాపించారు. బ్రిటిష్ ఇండియాలోని ముస్లిం సమాజ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ సంస్థ. ముస్లిం జాతీయవాదాన్ని పెంపొందించడం దీని ప్రాముఖ్యత. అయితే చివరికి 1947లో పాకిస్తాన్ ఆవిర్భావానికి దారితీసింది.
రష్యా బస్సుపై దాడి
2013, డిసెంబర్ 30: రష్యాలో ట్రాలీబస్సుపై బాంబు దాడి జరిగింది. రష్యాలోని వోల్గోగ్రాడ్‌లో జరిగిన బాంబు దాడిలో 16 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడికి ఏ వ్యక్తులు లేదా ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. గుర్తించబడని పరికరం వల్లనే పేలుడు సంభవించిందని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. అయినా ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయి.