calender_icon.png 6 November, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

04-11-2024 12:00:00 AM

-బరాక్ ఒబామా సంచలనం

2008 నవంబర్ 4:  ప్రపంచ అగ్రనేతల్లో బరాక్ ఒబామా ఒకరు. రాజకీయ చతురత, తన వాగ్ధాటితో ప్రపంచ రాజకీయాలను శాసించారు. ఈయన 2008లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెక్ కెయిన్ ను ఓడించి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆఫ్రికన్-.

బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక

1869 నవంబర్ 4: నేచర్ అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రిక. ప్రపంచంలో అత్యధికంగా చదివిన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమిక్ జర్నల్స్‌లో ఒకటిగానూ నిలిచింది. ఈ పత్రిక నెలకు మూడు మిలియన్ల మందితో ఆన్‌లైన్ రీడర్‌షిప్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రతి సంచికలో వ్యాపార, బడ్జెట్, శాస్త్రీయ, పరిశోధన  వంటి ఆసక్తి కథనాలు ప్రచురించబడతాయి. 

జాతీయ మిఠాయి దినోత్సవం

1916 నవంబర్ 4: జాతీయ మిఠాయి దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 4న జరుపుకుంటా రు. ఈ రోజు ఇష్టమైన స్వీట్స్ తినడానికి   మంచి అవకాశం.