calender_icon.png 21 October, 2024 | 6:54 AM

చరిత్రలో నేడు

21-10-2024 12:00:00 AM

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

1959 అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. శాంతిభద్రతల కోసం రాత్రినక, పగలనక కష్టపడుతూ మెరగైన సమాజానికి కృషి చేస్తుంటారు. సమాజంలో నేరాలను అరికట్టేందుకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తుంటారు.

అయితే 1959 అక్టోబర్ 21న పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీఎస్‌పీ కరమ్‌సింగ్ ఆధ్వర్యంలో 21 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ దళం భారత్- చైనా సరిహద్దులలో గస్తీ తిరిగింది. ఇదే సమయంలో చైనా బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి.

అయితే దళాలు వారిని ధీటుగా ఎదుర్కొన్నాయి. ఈ ఘర్షణలో పది మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ‘పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. 

ఆజాద్ హింద్ ప్రభుత్వం

1943 అక్టోబర్21:  స్వాతంత్య్ర పోరాటాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విదేశాల నుంచి కూడా కొనసాగించారు. ఆయన సింగపూర్‌లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వం బోస్‌కు జపనీయులతో సమాన స్థాయిలో చర్చలు జరపడమే కాకుండా, భారత జాతీయ సైన్యం (ఐఏన్ ఏ)లో చేరడానికి సులభతరం చేసింది.

అయితే అంతకుమందే 1942లో, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడింది. భారతదేశ విముక్తి కోసం ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోబడింది. ఈ మేరకు ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడిగా, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ అని పిలవబడే (ఐఏన్ ఏ) నాయకుడిగా నియమించబడ్డాడు.

నెమెర్స్‌డోర్ఫ్ ఊచకోత

1944 అక్టోబర్ 21: జర్మన్ పౌరులకు వ్యతిరేకంగా నెమెర్స్‌డోర్ఫ్ ఊచ కోత జరిగింది. ఈ ఊచకోత రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో రెడ్ ఆర్మీ సైనికులు చేసిన పౌర మారణకాండ. నెమ్మర్స్‌డోర్ఫ్ (మాయకోవ్‌స్కోయ్ , కాలినిన్‌గ్రాడ్ ఒబ్లాస్ట్ ) యుద్ధ సమయంలో అభివృద్ధి చెందుతున్న  జర్మన్ స్థావరాలలో ఒకటి.