calender_icon.png 22 October, 2024 | 5:57 PM

నేడు నానే బియ్యం బతుకమ్మ

05-10-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర పండుగ నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ పండుగను చేసుకుంటారు. ప్రతి ఇల్లు ఒక నందనవనంలా పూలతో కళకళ లాడుతూ ఉంటుంది. నాలుగవ రోజు ఉదయాన్నే మహిళలు అంతా తాజా పూలను కోసుకొచ్చి, ఇల్లంతా చక్కబెట్టుకుని, శుభ్రంగా తయారయ్యి కోసుకొచ్చిన పూలను పొందికగా పేరుస్తూ నాలుగు అంతరాలుగా బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మను పేర్చడానికి ముఖ్యంగా తంగేడు, గునుగు పూలను వాడతారు. తర్వాత నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.