calender_icon.png 18 January, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గ్రూప్--2 ప్రైమరీ కీ

18-01-2025 12:56:34 AM

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): గ్రూప్-2 పరీక్ష ప్రాథమిక కీని శనివారం టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని అధికారులు శుక్రవారం ప్రకటించారు. ప్రాథ మిక కీ పై శనివారం నుంచి ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

ఇక అభ్యంతరాలను కేవలం ఆంగ్ల భాషలోనే తెల పాలని సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంతరాలకు తప్పనిస రిగా.. ఆ అంశం ఏ పుస్తకంలోనిది... ఆథర్ ఎవరు, ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో పంపాలని పేర్కొన్నారు. గతేడా ది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్--2 రాతపరీక్షలు నిర్వహించిన విషయం విధితమే.