- ఏఐసీసీ పెద్దలతో భేటీ?
- రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చ
- అక్కడి నుంచి మహారాష్ట్ర ప్రచారానికి
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత హస్తినలో అందుబాటులో ఉన్న ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో రాజకీయ పరిణా మాలపై వారికి వివరించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడు దల కానున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశావాహులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటీపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఢిల్లీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లి రెండ్రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే.