26-03-2025 12:44:32 AM
ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాక
ఇబ్రహీంపట్నం, మార్చి 25 (విజయక్రాంతి): నేడు ఛలో రామోజీ ఫిల్మ్ సిటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి బుధవారం జరగబోయే కార్యక్ర మం గురించి వివరిస్తున్న ఆర్‌ఎఫ్సి ఇంటి స్థలాల పోరాట కన్వీనర్ పి.జగన్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..
ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామ రెవెన్యూ 189, 203 సర్వే నెంబర్లలో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించిన పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ఈనెల 26 న లబ్ధిదారులందరితో కలిసి చలో రామోజీ ఫిల్మ్ సిటీ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగిందని, ఈ కార్యక్రమానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారని తెలిపారు.
సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా 2007లో అప్పటి ప్రభుత్వం నాగన్ పల్లి, పోల్కంపల్లి, ముకునూర్, రాయపోల్ గ్రామాలలోని పేదలం దరికీ 60 గజాల చొప్పున 640 మంది పేదలకు ఇంటి స్థలం సర్టిఫికెట్లు ఇచ్చిందని పొజిషన్ కూడా చూపించింది, కానీ ఆ స్థలాల్ని రామోజీ యాజమాన్యం ఆక్రమించి పేదలను ఆ స్థలాల వైపు రానీయ కుండా అడ్డుకుంటుందని తెలిపారు.
అనేకమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, ఎమ్మార్వోలకు విన్నవించిన ఫలితం లేదని అధికారులు కూడా రామోజీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఇంటి స్థలా లను స్వాధీనం చేసుకోవడానికి అనేక పోరాటాలు నిర్వహించామని అందుకోసమే ఈనెల 26న చలో రామోజీ ఫిలిం సిటీకి పిలుపునిచ్చి ఎవరి ఇంటి స్థలాన్ని వారు స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులంతా పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు.