చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల శరీరమం తా నీరసంగా మారుతుంది. అంతేకాకుండా చలికాలంలో వెచ్చగా ఉండటం కూడా ముఖ్యం. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించాలి. అందుకే ప్రత్యేక ఆహారాల్ని డైట్‌లో చేర్చుకోవాలి. అవి ఏమిటో తెలుసా...
ఆహారంలో మిల్లెట్స్ చేర్చుకోవడానికి వింటర్ సీజన్ బెస్ట్ టైమ్. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగెలు వంటి మిల్లెట్స్ కిందకి వస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కఠిన మైన చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకు కూరల్ని చలికాలంలో తప్పక తినాలి.
ఇవి పోషకాల నిధి ఆకుకూరలు తక్కువ కేలరీల ఆహారం మాత్రమే కాదు.. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, రోగనిరోధక శక్తిని ప్రేరేపించే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలోపేతం చేస్తాయి.
ఖర్జూరం తినడానికి చాలా రుచిగా ఉండటమే కాకుండా అనేక రకాల స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఖర్జూరంలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతోపాటు బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు పొందొచ్చు. బెల్లంతో చేసిన అరిసెలు, స్వీట్స్, డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అలాగే చలికాలంలో నెయ్యి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.