- క్వారీగుంత నీటిలో దిగి ముగ్గురి మృతి
- ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారంలో ఘటన
సూర్యాపేట, జూలై 17 (విజయక్రాంతి): స్నేహితుడి కుటుంబంతో కలిసి అత్తగారింటికి వచ్చిన ఓ వ్యక్తి.. ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందిన విషాదఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని బొప్పారంలో బుధవారం జరిగింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం జూపెడకు చెందిన తిప్పారెడ్డి శ్రీపాల్‌రెడ్డి తన కుటుంబం, తన స్నేహితుడు అయిన అశ్వారావుపేటకు చెందిన చామలి రాజు కుటుం బంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి భార్య శైలజ, రాజు భార్య నాగమణి ఇద్దరూ క్లాస్‌మెంట్స్. వీరంతా కలిసి నెమ్మికల్ దండు మైసమ్మ వద్ద శ్రీపాల్‌రెడ్డి బంధువుల శుభకార్యానికి హాజరయ్యారయ్యారు.
ఆత్మకూరు మండలంలోని బొప్పారంలోని శ్రీపాల్‌రెడ్డి మామ నల్లా ఉపేందర్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని చెక్ డ్యాం తదితర పరిసరాలను కుటుంబీకులతో కలిసి వీక్షించారు. బుధవారం ఉదయం ఈత కోసమని శ్రీపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు చేతన్, రాజు ఆయన పెద్ద కూతురు ఉషాంక, చిన్న కూ తురు రిషిక, ఆయన భార్య నాగమణి, శ్రీపాల్‌కరెడ్డి బంధుల అమ్మాయి వర్షిత బిక్కేరు వాగుకు వెళ్లారు. అయితే అక్కడి నీరు లేకపోవడంతో చెరువు పక్కనే గల క్వారీ గుంత వద్దకు వచ్చారు. వారిలో చేతన్‌కు మాత్రమే ఈత రాగా ఆయన క్వారీ గుంతలో ఆగిన నీటిలోకి ఈతకు దిగాడు. లోతు తక్కువగా ఉందంటూ రాజు పెద్ద కూతురు ఉష గుంతలోకి దిగింది.
ఆమె కొంచెం లోపలికి వెళ్లగా లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోవడంను గమనించిన ఆమె తండ్రి రాజు ఆమె ను కాపాడేందుకు నీటిలోకి దిగాడు. ఆయన కు సైతం ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా అతని స్నేహితుడు శ్రీపాల్‌రెడ్డి ఆయనను కాపాడేందుకు నీటిలోకి దిగాడు. అదే సమయంలో రాజు చిన్న కుమార్తె రిషిక సైతం నీటిలోకి జారిపడగా శ్రీపాల్‌రెడ్డి కుమారుడు చేతన్ ఆమెను కాపాడి బయటకు తీసుకవచ్చాడు. ఈలోగా శ్రీపాల్‌రెడ్డి (40), రాజు (45), ఉష (12) నీటిలో మునిగి మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రవి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులులు మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట మార్చరీకి తరలించారు. శ్రీపాల్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.