అక్సర్ మరియు కుల్దీప్ ఇంగ్లండ్ మాయజాలం
టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్ పోరులో ఇంగ్లాండ్ను టీమిండియా 68 పరుగుల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ (47) చెలరేగారు.
అనంతరం భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (25), జోస్ బట్లర్ (23) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, కుల్దప్ యాదవ్ 3, బుమ్రా ఒక వికెట్ తీశారు.
ఈనెల 29న దక్షిణాఫ్రికా- భారత్ మధ్య ఫైనల్ తలపడనుంది.