calender_icon.png 26 October, 2024 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కురుల అందానికి!

21-05-2024 12:05:00 AM

ఒవ వైపు విపరీతమైన వాతావరణ కాలుష్యం, మరోవైపు తినే ఆహారంలో కల్తీ... మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి వ్యక్తిగత ఒత్తిళ్ల వల్ల మనిషి జుట్టు రాలి పోవడానికి దోహదపడుతున్నాయి. జుట్టు రాలే ప్రక్రియను నివారించడానికి ఆయుర్వేదంలో చక్కని చికిత్స ఉంది. చిన్న చిన్న చిట్కా లతో గృహవైద్యం చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం లభిస్తుంది. అదెంటో తెలుసుకుందాం..

జుట్టు పెరుగుదలకు..

మందార పువ్వులు, గోరింటాకు, కలబంద గుజ్జును తీసుకుని నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి ఏదైనా శుభ్రం చేసిన గాజు సీసాలో నిల్వచేసుకో వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను రాస్తే నల్లగా జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ మధ్య చాలామంది బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు సీతాఫలం ఆకును పేస్ట్ చేసి, అందులో కొద్దిగా మేక పాలతో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా తరచుగా చేస్తుంటే చాలా వరకూ బట్టతల తగ్గే అవకాశం ఉంది. గురివింద ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకావం ఉంది.