ఫిట్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ చలిలో వ్యాయామాలు చేయడానికి ఒళ్లు బద్దకిస్తుంటుంది. ఈ కారణంతో ఒక్కసారిగా బరువు పెరుగుతుంటారు. అయితే చలికాలంలో ఫిట్‌నెస్ ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం..
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. చలి నుంచి శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. కాబట్టి చలి భయంతో బయ టికి వెళ్లకుండా ఉంటే వెచ్చదనాన్ని పొంద లేం. అందువల్ల ఉదయాన్నే లేచి ఓ పదిహేను నిమిషాల పాటు జాగింగ్‌కు వెళ్లడం మంచిది. దీనివల్ల చలిలో కాసేపు గడిపినట్లయితే చలి తీవ్రత అంతగా తెలియకపో వ చ్చు. అలాగే చలికాలంలో వీచే గాలుల వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయి. దీంతో వ్యాయా మం చేయడానికి శరీరం సహకరించదు. అందుకే వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తారు.
సూర్య నమస్కారాలు
చలికాలంలో వర్కవుట్స్ చేయకుండా ఉదయాన్నే నడక, రన్నింగ్ చేయటం వల్ల ఉపశమనం పొందొచ్చు. రక్తప్రసరణ సాఫీ గా జరగటమే కాకుండా నిద్రమత్తు వదులుతుంది. జాగింగ్ తర్వాత శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఎలాంటి గాయాలపాలు కాకుండా జాగ్రత్తగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక సూర్యనమస్కారాలు చేయటం కూడా మంచిది. దీని వల్ల విటమిన్-డి శరీరానికి అందుతుంది. ఒత్తిడి ఉంటే మాత్రం కచ్చితంగా మెడిటేషన్ చేయటం మంచిది.
ఇంట్లోనూ..
బీజీ లైఫ్ కొంతమందికి బయటకు వెళ్లి జాగింగ్, వ్యాయామం చేసే సమయం ఉండ దు. అలాంటప్పుడు ఇంట్లోనే వర్కవుట్స్ చేసుకోవచ్చు. గుంజీలు తీయడం, యోగా ఆసనాలు వేయడం, పుషప్స్ కొట్టడం, బాడీ స్ట్రెచింగ్, మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు. ఇంట్లోనే వ్యాయామం చేయడం వల్ల సమ యం కూడా ఆదా అవుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇంటి వర్కవుట్స్ బెటర్.
తగినంత నీరు, పండ్ల రసాలు
చలికాలంలో చాలామందికి చర్మం పొడిబారుతుంటుంది. చర్మం తేమను కోల్పో వడం, మూత్రం రూపంలో ఎక్కువగా నీరు బయటికి వెళ్లిపోవడం.. వంటి కారణాల వల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేయకపోయినా నీరు, తాజా పండ్ల రసాలు.. వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
-గ్రూపుగా..
సాధారణంగా చలికాలంలో వ్యాయా మం చేయాలనిపించదు. కాబట్టి ఒక్కరిగా కాకుండా స్నేహితులతో, బంధువులతో కలి సి వ్యాయామం చేస్తే మంచిది. ఎందుకంటే ఒక్కరు వ్యాయామం చేయడం కంటే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపి స్తాం. కాబట్టి ఇతరులతో కలిసి వ్యాయామం చేయండి. దీంతో బోర్ కొట్టదు.
సరైన దుస్తులు
చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా ఉన్ని దుస్తులు, చేతులకు గ్లౌజులు, పాదాల కు సాక్సులు ధరించి షూస్ వేసుకోవడం మంచిది. అలాగే తలకు క్యాప్ పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తేనే చలి నుంచి చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడొచ్చు.
చలికాలంలో వ్యాయామం చేస్తే
* రక్త ప్రసరణను మెరుగుపడటం
* మూడ్ స్వింగ్స్ అదుపులో ఉండటం
* మంచి నిద్ర
* గర్భధారణ సంబంధిత వ్యాధుల నివారణ
* రోజువారి ఒత్తిడి దూరం
* గుండె జబ్బులు తగ్గే అవకాశం
* విటమిన్ డీ పుష్కలం