calender_icon.png 21 October, 2024 | 2:04 PM

పోలీసుల అంకితభావాన్ని గొప్పగా చూపేలా..

24-07-2024 12:00:00 AM

‘మగధీర’, ‘పూలరంగడు’ తదితర తెలుగు చిత్రాలతో ప్రతినాయకుడిగా తెలుగు వారికి చేరువైన దేవ్‌గిల్  కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు పేట త్రికోటి దర్శకుడు. ఈ సినిమాను ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్టు నిర్మాణ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తూ మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ సినిమాలో ‘పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్ప గా చూపించబోతున్నాం. ఇప్పటి వరకు నాలోని నటుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్షకులు మరో కోణాన్ని వెండితెరపై చూస్తారు’ అని దేవ్‌గిల్ అన్నారు.