నిబంధలను సడలించనున్న రష్యన్ ప్రభుత్వం
మాస్కో, డిసెంబర్ 16: టూరిస్ట్ వీసా లేకుండా భారతీయులు రష్యాను సందర్శించేందుకు వీలుగా ఆ దేశం చర్యలు తీసుకుంటున్నది. వచ్చే ఏడాదిలోనే రెండు దేశాల మధ్య పర్యాటక రంగంపై ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. ఇప్పటికే భారతీయులు టూరిస్ట్ వీసా లేకుండా 62 దేశాలను సందర్శించే వెసులుబాటు ఉంది. ఈ జాబితాలో త్వరలో రష్యా కూడా చేరనున్నది. ఈ ప్రతిపాదనలపై రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రి నిఖిత కొండ్రాటీవ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘భారత్‌తో రష్యా దగ్గరి సంబంధాలు నెరపాలనుకుంటున్నది. దీనిలో బాగంగానే టూరిస్ట్ వీసాపై నిబంధనలను సడలించబోతున్నాం. ఈ అంశంపై జూన్‌లో రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయి.’ అని ప్రకటించారు.