బావను బండరాయితో మోది చంపిన బావమరిది
రాజేంద్రనగర్, నవంబర్ 10: అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బావ వరుసయ్యే వ్యక్తిని బండరాయితో మోది చంపిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లికి చెందిన సైఫ్ (42) టీవీ మెకానిక్. ఇతడికి బావమరిది వరుసయ్యే ఇస్మాయిల్.. గౌస్ నగర్‌లో ఉంటున్నాడు. కొన్నిరోజుల క్రితం ఇస్మాయిల్‌కు సైఫ్ సుమారు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చాడు.
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సైఫ్ బావమరిది అయిన ఇస్మాయిల్‌ను కొన్ని రోజులుగా అడుగుతున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరుగు తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంట లకు వట్టేపల్లి లో సైఫ్ రక్తపు మడుగులో మృతదేహంగా పడిఉన్నాడు. ఏసీపీ శ్రీనివాస్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నరేందర్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి తలను రాయి తో మోది చంపినట్లు గుర్తించారు. డబ్బు విషయమై గొడవతోనే ఇస్మాయిల్.. బావ సైఫ్‌ను హత్య చేసి పరారై ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చా రు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.