calender_icon.png 20 April, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెమట వాసన తగ్గాలంటే..

20-04-2025 12:00:00 AM

రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయాలి. దీనివల్ల శరీరంపై బ్యాక్టీరియా తొలగిపోయి చెమట వాసన తగ్గుతుంది.

వేసవిలో ఎండవల్ల డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం ఎక్కువ నీరు తాగాలి. దీనివల్ల చెమట వాసనతో పాటు నోటి నుంచి దుర్వాసన కూడా తగ్గుతుంది. 

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం బ్యాక్టీరియాను చంపుతుంది. వేసవిలో నిమ్మరసం తాగితే చెమట వాసన దూరం అవుతుంది. 

వెల్లుల్లి, ఉల్లిపాయ, మసాలాలను వేసవిలో తక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తింటే చెమట వాసన ఎక్కువగా వస్తుంది. కాఫీ, మద్యం శరీరంలో వేడిని పెంచి చెమట వాసనకు కారణమవుతాయి.