calender_icon.png 19 March, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లటి మచ్చలు తగ్గాలంటే..

02-03-2025 12:00:00 AM

గర్భధారణ సమయంలో శరీరంలో  హార్మోన్ల అసమతుల్యత వల్ల  నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. అలాంటివి అందవిహీనంగా కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. 

* ఒక చెంచా నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లు చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు సమస్య తగ్గిపోతుంది.

* టామాటో రసం, కీరా రసం సమపాళ్లలో తీసుకొని దానికి కొద్దిగా పాలు కలిపి ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లు చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికి సరిపోతుంది.

* ఎలాంటి చర్మ సమస్యనైనా తగ్గించే శక్తి కలబందకు ఉందనడంలో సందేహం లేదు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే పిగ్మెంటేషన్‌కు కూడా సమూలంగా తొలగిస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వారం రోజుల్లోనే ముఖంలో తేడా గమనించచ్చు.