calender_icon.png 11 January, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాదాల పగుళ్లు తగ్గాలంటే!

17-12-2024 12:00:00 AM

ప్రస్తుతం చాలామంది పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏవేవో క్రీములు వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల హోం రెమెడీస్ పాదాల పగుళ్ల సమస్యను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కాళ్లను మృదువుగా మారుస్తాయి. 

* పాదాల పగుళ్లను తగ్గించడంలో కర్పూరం బాగా పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పగిలిన మడమలను నయం చేయడంలో సహాయపడుతుంది. 

* కర్పూరాన్ని పొడిగా చేసి ఒక చెంచా కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకునే ముందు మడమల మీద అప్లు చేసి సాక్సులు ధరించాలి. ఇలా చేస్తే కాళ్ల పగుళ్లు త్వరగా                తగ్గిపోతాయి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా కర్పూరం యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. 

*కర్పూరం పొడిలో శనగపిండిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పాదాలకు పట్టించి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలపై ఉండే      మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి. 

* కర్పూరం పొడిలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి.. మడమలపై అప్లు చేసి 10 నిమిషాల పాటు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. 

* కర్పూరం పొడిలో గ్లిజరిన్‌లో కలిపి.. రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.