వానకాలంలో చిన్నారులు ఎక్కువ ఇన్ఫెక్షన్లు బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు వస్తే మాత్రం అంత ఈజీగా వదలదు. పసిపిల్లలు ఆగకుండా దగ్గు వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే దగ్గు నుంచి కొంత ఊరట లభిస్తుంది. ఆ చిట్కాలను కూడా వైద్యులను సంప్రదించి వాడటం మంచిది. దగ్గు చాలా రకాలుగా ఉంటుంది. పొడి దగ్గు, కఫం దగ్గు ఇలా రకరకాలుగా దగ్గు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏదీ మింగలేక పోతుంటారు. అంతలా దగ్గుతో ఇబ్బంది పడతారు. చిన్నారులు దగ్గినప్పుడు కఫం బయటకు వస్తుంది.
ఆ సమయంలో వారి శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే తల్లి పాలు ఇవ్వడం మంచిది. పిల్లలు పడుకునే ముందు ఒక చిన్న చెంచా తేనెను తాగిస్తే మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చిన్నారులు ఉండేగదిలో ఎయిర్ ఫ్యూరిపయర్లను ఉపయోగించడం మంచిది. అంతే కాకుండా పిల్లలు వాడే పరుపులు, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి.