25-03-2025 01:40:27 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, మార్చి 24 (విజయ కాంతి): మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మ గూడెం, ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహం, గూడూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ హై స్కూల్ (ఈఎంఆర్‌ఎస్) సందర్శించారు,ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని కిచెన్, క్లాస్ రూమ్, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు.
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలని సూచించారు. ప్రతీ సబ్జెట్ వారిగా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చాలని, స్టడీ ఆవర్ లో ఉన్నా పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ ఏమైనా ఇబ్బంది ఉందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిల్లలకు సూచించారు. అలాగే ప్రత్యేక అధికారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. రాత్రి సమయాలలో నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి క్రిమి కీటకాలు, విషపురుగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం సిద్ధం చేయాలని సూచించారు,ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట సంబంధిత వార్డెన్లు ఉపాధ్యాయులు ఉన్నారు.