calender_icon.png 20 November, 2024 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల ఉనికి కాపాడేందుకే

31-08-2024 02:00:02 AM

బీజేపీలో చేరుతున్నా: చంపయి సోరెన్

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆదివాసీల ఉనికిని కాపాడేందుకే బీజేపీలో చేరుతున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్ పేర్కొన్నారు. బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ సందర్భంగా వివరించారు. నేను ఎంతో కష్టించి పని చేసిన పార్టీలో నాపై జరిగిన రాజకీయాల గురించి ఆగస్టు 18న పేర్కొన్నా.

కొత్త పార్టీ లేదా ఏదైనా మంచి భాగస్వామి దొరికితే జార్ఖండ్ అభివృద్ధి కోసం వారితో చేరుతానని అప్పుడే స్పష్టం చేశా. బీజేపీ రూపంలో నాకు మంచి పార్టీ దొరికింది. రాష్ట్రాభివృద్ధి, గిరిజన సమాజ రక్షణకు బీజేపీలో చేరుతు న్నా అని వెల్లడించారు. జార్ఖండ్ కోసం మునుపటి తరహాలోనే పోరాడుతానని, తప్పనిసరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. భూవివాదంలో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన కారణంగా చంపయి జార్ఖండ్ సీఎం అయ్యారు. 2 నెలలు గడవకముందే హేమంత్ జైలు నుంచి విడుదల కాగానే చంపయిని తొలగించి హేమంత్ సీఎం పీఠాన్ని అధిరోహించారు.