సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర నిర్మాతలు సోమవారం విజయవాడలో కలిశారు. అనంతరం వారు ఈ భేటీ ఉద్దేశాన్ని తెలుపుతూ “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసే విషయమై పవన్‌ను కలిశాం. ఆ సమావేశంలో పరిశ్రమలోని అన్ని సంఘాలతో కలిసి అన్ని విషయాలు చర్చిస్తాం” అని పేర్కొన్నారు. సిని మాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ హాజరైన ఈ సమావేశంలో నిర్మాతలైన అశ్వినీదత్, అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, దిల్ రాజు, డి.సురేశ్ బాబు, నవీన్ ఎర్నేని, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు.