calender_icon.png 29 November, 2024 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

68 మంది బృందంతో మలేషియాకు

29-11-2024 12:00:00 AM

  • ఆసియా ఫసిఫిక్ డెఫ్ గేమ్స్

న్యూఢిల్లీ: మలేషియాలోని కౌలలంపూర్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు జరగనున్న ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్ కోసం 68 మందితో కూడిన భారత ఆటగాళ్ల బృందం బయల్దేరి వెళ్లింది. నేడు మలేషియా వెళ్లనున్న నేపథ్యంలో భారత జట్టుకు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో టూరింగ్ పార్టీ నిర్వహించింది.

కాగా ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్‌లో భారత్ ఏడు క్రీడాంశాల్లో (అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, జూడో, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, రెజ్లింగ్) పోటీ పడనుంది. ఈ టోర్నీలో పాల్గొననున్న ఆటగాళ్లకు వచ్చే ఏడాది జపాన్ వేదికగా జరగనున్న డెఫిలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేయడానికి వేదికగా మారనుంది. 2015లో తైవాన్ వేదికగా చివరిసారి జరిగిన ఆసియా పసిఫిక్ గేమ్స్‌లో భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు గెలుచుకుంది.