calender_icon.png 26 October, 2024 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజసం ఉట్టిపడేలా..

24-10-2024 12:38:24 AM

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలేర్పడ్డాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

అయితే, బుధవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను చిత్రబృందం యూనిక్‌గా డిజైన్ చేశారు. సింహాసనంలో కూర్చున్న రాజాసాబ్‌ను పోస్టర్‌లో పరిచయం చేశారు. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ వింటేజ్ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. మోషన్ పోస్టర్‌కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చేసిన మూవీ థీమ్ సాంగ్ ఆకర్షణగా నిలుస్తోంది.

‘హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్’ అనే క్యాప్షన్ పోస్టర్ చివరలో వేయడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే హారర్ ఫ్లస్ కామెడీ చిత్రంలో ఉండబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ప్రొడ్యూసర్: టీజీ విశ్వప్రసాద్; రచన, దర్శకత్వం: మారుతి.