అధిక బరువు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్య. బరువు పెరిగినంత తేలికగా, వదిలించుకోవడం వీలు కాదు. దీనికోసం చాలామంది వ్యాయామం అనీ, డైటింగ్ అని అనేక పద్దతుల్ని పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి రోజువారి తీసుకునే ఆహారం మీద శ్రద్ద వహించడం చాలా అవసరం. ఆహారం విషయంలో ఎంత శ్రద్ద పెడితే అంత త్వరగా బరువు తగ్గేందుకు వీలు ఉంటుంది. కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అవేమిటంటే..
క్యారెట్ జ్యూస్: తక్కువ క్యాలరీలు ఉన్న కూరగాయలు బరువు తగ్గడానికి ఎంచుకోవడం మంచి జీర్ణక్రియకు సహకరిస్తాయి. అందులో ముఖ్యంగా క్యారెట్ జ్యూస్, క్యారెట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు త్వరగా తగ్గేందుకు సపోర్ట్ చేస్తుంది.
సొరకాయ జ్యూస్: సొరకాయలో ఫైబర్ అధికంగా ఉం టుంది. ఇది తీసుకున్న చాలా సమయం వరకూ కడుపు నిండుగా ఉంటుంది. క్యాలరీల విషయానికి వస్తే సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. రోజూ తినే ఆహారంలో సొరకాయను చేర్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బీట్‌రూట్: బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. బరువు తగ్గడంతో పాటు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండి రక్త వృద్ధిని పెంచుతాయి. బీట్‌రూట్ రసంలో యాపిల్స్, క్యారెట్ వంటి కూరగాయలను కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు.
బచ్చలికూర: బచ్చలి కూరలో కూడా మంచి పోషకాలున్నాయి. బచ్చలికూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఉప్పు, నిమ్మరసం కలిపిన బచ్చలికూర జ్యూస్ రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.