calender_icon.png 23 October, 2024 | 7:56 PM

బరువు తగ్గాలంటే!

15-07-2024 12:05:00 AM

బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడంలో పసుపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు పసుపు నీరు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వంటగదిలో ఉపయోగించే మసాలాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి వాటిలో పసుపు చాలా ముఖ్యమైనది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్, యాంటీ బయోటిక్స్ మెరుగ్గా ఉంటాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. 

బరువు తగ్గడం కోసం కోసం ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగాలి. దీనివల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రెండు కప్పుల నీటిలో ఒక చెంచా పసుపు కలిగి మరిగించాలి. ఈ నీటిలో తేనె, చిటికెడు నల్ల మిరియాల పొడి, ఉప్పు కొద్దిగా కలుపుకొని తాగాలి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అధికరక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పసుపు కలిపిన నీటిని తాగితే బీపీ తగ్గుతుంది.