ప్రతి ఒక్కరికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే సాధారణంగా టీ తాగేటప్పుడు, ఎవరికైనా ఇస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు బట్టలపై పడుతుంటాయి. దీంతో ఆ మరకలు దుస్తులపై ఉండిపోతాయి. ఆ మరకలు పోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. సింపుల్‌గా టీ మరకలు పోవాలంటే.. కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* బేకింగ్ సోడాను సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. దీంతో బట్టలపై మరకలు కూడా తొలగించుకోవచ్చు. ఎలా అంటే.. టీ లేదా కాఫీ పడిన చోట కొంచెం బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా చేత్తో రుద్దాలి. ఐదు నిమిషాల తర్వాత బట్టలను వాష్ చేస్తే మరకలు ఇట్టే తొలగిపోతాయి.
* సాధారణంగా కాటన్ దుస్తులపై టీ మరకలు పడితే పోవడం చాలా కష్టం. అలాంటప్పుడు ఎక్కడైతే టీ మరకలు ఉన్నాయో ఆ ప్రదేశంలో కాస్త వేడి నీటిని పోసి.. వాష్ చేస్తే సరి. మరకలు తొలగిపోతాయి. బాగా వేడినీటిని ఉపయోగించడం వల్ల బట్టల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
* బట్టలపై మరకలు తొలగించడంలో వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. ఒక గ్లాసు నీళ్లల్లో రెండు చెంచాల వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. అరగంట తర్వాత వాష్ చేస్తే టీ మరకలు మాయం అవుతాయి.
* బట్టలపై మరకలను తొలగించేందుకు టూత్ పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం టీ మరకలు పడిన చోట పేస్ట్‌ని పూసి పది నిమిషాల పాటు ఉంచి.. ఆ తర్వాత నీటితో కడిగేస్తే.. మరకలు తొలగిపోతాయి.