calender_icon.png 23 October, 2024 | 7:04 PM

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే!

03-09-2024 12:00:00 AM

డెలివరీ తర్వాత మహిళలు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా బరువు పెరగడంతో పాటు శారీరకంగా ఎన్నో మార్పులు వస్తాయి. డెలివరీ అయిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యే సమస్య స్ట్రెచ్ మార్క్. ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం..

  1. గర్బం దాల్చిన సమయంలో వీలైనంత వరకు చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్బం దాల్చిన సమయంలో చర్మం సాగుతుంది. దీంతో చర్మంపై చారలు ఏర్పడుతాయి. కానీ చర్మం తేమగా ఉంటే ఈ సమస్య రాదు. విటమిన్ ఇ, కోకో బటర్, అలోవెరా వంటి వాటిని చర్మంపై అప్లు చేయాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. 
  2. చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే.. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం హైడ్రేట్‌గా ఉంటే చర్మం తాజాగా, స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు. 
  3. స్ట్రెచ్ మార్స్ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గర్భదారణ సమయంలో విటమిన్ సి, ఇ, జింక్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ పోషకాలు చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుతాయని వైద్యులు చెబుతున్నారు. 
  4. కడుపుపై క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవాలి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో జెల్స్ లేదా కొబ్బరి నూనెతో 10-15 నిమిషాలు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.