ప్లాస్టిక్ వస్తువులు నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఇళ్లలో అనేక రకాలైన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అవి పగిలి పోయేంత వరకు ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ వస్తువులపై పడే మరకలు పోగొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈజీగా మరకలను తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- శానిటైజర్‌తో ప్లాస్టిక్ వస్తువులపై పడ్డ మరకల్ని ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక గంట సేపు శానిటైజర్ కలిపిన గోరు వెచ్చటి నీటిలో వస్తువులను నానబెట్టాలి. ఆ తర్వాత సబ్బుతో రుద్ది కడగాలి. ఇలా చేస్తే ప్లాస్టిక్ వస్తువులపై పడ్డ మరకలు ఈజీగా తొలగిపోతాయి.
- ఉప్పు, నిమ్మరసంతో ప్లాస్టిక్ పాత్రలపై పడ్డ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. ముందుగా మరకలు ఉన్నచోట ఉప్పు రాసి.. స్క్రబ్ చేయాలి. ఒకసారి కడిగి.. ఆ తర్వాత నిమ్మరసంతో రుద్దాలి. ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టి శుభ్రంగా కడిగితే మరకలు తొలగిపోతాయి. నిమ్మరసం మరకలను తొలగించడంలో సహజమైన బ్లీచింగ్‌లా పని చేస్తుంది.
- క్లోరిన్ బీచ్ సహాయంతో కూడా ప్లాస్టిక్ వస్తువులపై పడ్డ మరకల్ని ఈజీగా తొలగించుకోవచ్చు. బ్లీచ్ బాగా కఠినంగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ పాత్రలపై పడ్డ మరకలు సులభంగా పోతాయి. బ్లీచ్ వేసి రుద్ది కాసేపు పక్కన పెట్టి.. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే మరకలు అనేవి పోతాయి.