calender_icon.png 25 November, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తగతం చేసుకోవాలని..!

04-11-2024 02:24:06 AM

  1. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ నేతలు 
  2. స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
  3. నార్త్ మహారాష్ట్రలో మంత్రి సీతక్క, నాందేడ్‌లో మంత్రి ఉత్తమ్
  4. అధికార పార్టీ వైఫల్యాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ 

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో జట్టు కట్టి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఢిల్లీ పెద్దలు.. పార్టీ అభ్యర్థుల విజ యం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

సీఎం రేవంత్‌రెడ్డిని మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపె యినర్‌గా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించారు. ఇక ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు మార్ మహారాష్ట్రలో ఇన్‌చార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎంపీ లు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవిల కు కూడా మహారాష్ట్రలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా నియమించారు. 

కార్యాచరణ షురూ..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే జార్ఖండ్‌కు వెళ్లి.. అక్కడి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవ ర్గాల పరిశీలకులతో సమావేశమై.. ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడే ఉండాలని సూచించారు. మంత్రి సీతక్కకు కూడా పార్టీ కీలక స్థానాలకు ఇన్‌చార్జిగా నియమించింది.

నార్త్ మహారాష్ట్రలోని గుజరాత్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న నందూర్‌బర్ పార్లమెంట్ తో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో షిరిడీ, నాసిక్, దూలే, అహ్మద్‌నగర్, జలగామ్ వంటి కీలక నియోజకవర్గాలున్నాయి.

ఇక్కడ  హిందూ వాదం తో పాటు ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండటం తో మంత్రి సీతక్కను ఇన్‌చార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతం లోనూ ఛత్తీస్‌గఢ్‌లోనూ సీతక్క ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆమె సేవలను మహారాష్ట్రలో నూ వినియోగించుకోవాలని పార్టీ భావించింది. కాగా మంత్రి సీతక్క తన కార్యాచరణ షురూ చేశారు.

ఇప్పటికే ఓసారి మహారాష్ట్ర కు వెళ్లి వచ్చారు. పొత్తులో భాగంగా టికెట్ రాని నాయకులు రెబల్స్‌గా పోటీ చేస్తుండటంతో.. వారిని బుజ్జగించి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క విజయం కోసం పని చేసిన టీమ్‌ను, ఆమె మహారాష్ట్ర ఎన్నిక ల ప్రచారంలో దింపుతున్నట్లు సమాచారం.

గెలుపే ధ్యేయంగా..

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికు నాందేడ్ జిల్లా బాధ్యత అప్పగించగా, ఇప్పటికే ఓసారి అక్కడికి వెళ్లి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌కు పూర్వవైభ వం తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కు మార్‌రెడ్డి చంద్రాపూర్ పార్లమెంట్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి యావత్మాల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెం బ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు.

కాగా వీరు ఇప్పటికే మహారాష్ట్రకు పలుమార్లు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. స్థానిక నాయకుల ను సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపించుకోవాలని మార్గనిర్ధేశం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ అప్పగించిన బాధ్యతలను నేరవేర్చి, మహారాష్ట్రలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు.

సమన్వయంతో ముందుకు..

ఆయా ప్రాంతాల్లో ఇన్‌చార్జులుగా నియమితులైన నాయకులు తమ నియోజకవర్గాల్లో.. స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. టికెట్ రాని వారి నుంచి అస మ్మతి ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని రెబల్స్‌ను బుజ్జగిస్తూ దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో పాటు అధికార కూటమికి వ్యతిరేకంగా ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకొని, ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలు, రైతులు, ఉల్లి రైతులు సమస్యలను లెవనెత్తి ఓట్ల ను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రయోజనాలను ఢిల్లీలో పెత్తనం చేస్తున్న పెద్దలు గుజరాత్‌కు తరలించుకుపోతున్నారనే విమర్శలను ఎక్కుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారు.