calender_icon.png 1 October, 2024 | 5:09 AM

౩ నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన

01-10-2024 02:30:18 AM

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సర్కారు కసరత్తు

పైలట్‌గా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాలు

పొరపాట్లకు తావివ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

కుటుంబ ఫొటో ఆప్షన్‌గా ఇవ్వాలని సూచన 

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్‌డీసీ) జారీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రక్రి యను సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు.

ఒకవేళ పూర్తిగా పట్టణ/నగర నియోజకవర్గమైతే రెండు వార్డులు/డివిజ న్లు.. అలాగే పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే రెండు గ్రామాలను ఎంపిక చేసు కోవాలని సూచించారు. మొత్తంగా 119 ని యోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని స్పష్టంచేశారు.

వార్డులు/డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.

అనుమతిస్తేనే కుటుంబం ఫొటో తీయాలి

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రా జెక్టు, సేకరించే వివరాలను అధికారులు ము ఖ్యమంత్రికి వివరించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రా మాలు, వార్డులు/డివిజన్ల ఎంపిక పూర్తయ్యి ందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మా ట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజులపాటు చేపడతారని అధికారులను ప్రశ్నించా రు.

అక్టోబర్ 3 నుంచి 7 వరకు ఐదు రోజులపాటు చేపడతామని అధికారులు తెలిపా రు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంద రూ సమ్మతిస్తేనే కుటుంబం ఫొటో తీయాల ని, కుటుంబం ఫొటో తీయడమనేది ఆప్షన్‌గా ఉండాలని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయి ప రిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఉ న్న నోడల్ అధికారులకు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పకడ్బందీగా కా ర్యక్రమం కొనసాగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం వద్ద ఉన్న రేషన్ కా ర్డులు, పింఛను సహాయక సంఘా లు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డాటాల ఆ ధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యిందని, పై లట్ ప్రాజెక్టులో దానిని నిర్దారించుకోవడంతోపాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందినవారిని తొలగిస్తామని అధికారులు వివరించారు.

కుటుంబ సభ్యుల వివ రాల నమోదు, మార్పులు.. చేర్పుల విషయ ంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచి ంచారు. పైలట్ ప్రాజెక్టుతో బయటకు వచ్చి న సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని చెప్పారు . ఆ నివేదికపై చర్చించి, లోపాలను సరిదిద్ది, అన ంతరం పూర్తిస్థాయిలో పరిశీలించాలని అ న్నారు.

సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి స లహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శు లు చంద్రశేఖర్‌రెడ్డి, అజిత్‌రెడ్డి, కార్యదర్శులు సంగీత సత్యనారాయణ, మాణిక్‌రాజ్, వివి ధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.